6వే  పనులను నిలుపుదల చేయాలి


నందిగామ మండలం చందాపురం జాతీయ రహదారిపై నిర్మితమవుతున్న 6వే  పనులను నిలుపుదల చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు  నూతనంగా నిర్మించే జాతీయ రహదారి  చుట్టుపక్కల  పాఠశాల పిల్లలు ,  సుమారు 400 ఎకరాల భూ యజమానులు రాకపోకలకు అడ్డంకులు కలిగించే విధంగా జాతీయ రహదారి నిర్మితమవుతున్నది  ఆ ప్రాంతంలో అండర్పాస్ ఏర్పాటు చేయాలని గతంలో హైవే అధికారులకు పలుమార్లు   తెలిపిన మా మాటను పెడచెవిన పెడుతున్నారని రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు.అండర్ పాస్ లు ఏర్పాటు చేయటం వల్ల స్కూల్  పిల్లల, ఆ ప్రాంతం భూ యజమానులు  రాకపోకలకు ఇబ్బంది లేకుండా  రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని రైతులు  వాపోతున్నారు  తక్షణమే జాతీయ రోడ్డు రవాణా సంస్థ అధికారులు తమ సమస్యను పరిశీలించి  అండర్ పాస్ లను  ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.